KMR: నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద తాకిడి తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్టులోకి 2,498 క్యూసెక్కుల ఇన్ వస్తుండగా, ఒక వరద గేటును ఎత్తి అంతే మొత్తంలో నీటిని మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అంతే స్థాయిలో నీరు నిండుకుండలా ఉందని ఆయన పేర్కొన్నారు.