SRD: చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని ఆమె విగ్రహానికి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పూలమాలవేసి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్, తహసిల్దార్ జయరాం నాయక్ తదితరలు పాల్గొన్నారు.