HYD: బాలాపూర్ గణనాథున్నీ సందర్శించి తిరిగి వస్తున్న సమయంలో ఒక జంట టూ వీలర్‌పై పయనిస్తుండగా సెల్ఫ్ యాక్సిడెంట్ జరిగింది. అదే సమయంలో అటు వైపునుంచి వెళ్తున్న రాచకొండ సీపీ సుధీర్ బాబు వాహనం ఆపి కిందకు దిగి బాధితులకు ఫస్ట్ ఎయిడ్ చేయించారు. ఆపద సమయంలో తన గోప్ప మనసు చాటుకున్నారు. స్వయాన సీపీ వాహనం ఆపి బాధితులకు సేవ చేయటం పట్ల పలువురు ప్రశంసించారు.