MBNR: డిండి ప్రాజెక్టుకు నీటిని తరలించే ప్రతిపాదనను సీఎం రేవంత్ రెడ్డి విరమించుకోవాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం పాలమూరు ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని ధ్వజమెత్తారు. నీటి తరలింపుపై జిల్లా ఎమ్మెల్యేలు మౌనం వీడి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆమె హితవు పలికారు.