MDK: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అక్రమంగా మద్యం, డబ్బు తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చిలిపి చేడ్ ఎస్సై నర్సింలు సూచించారు. మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాల్లో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. 50 వేలకు మించి అధికంగా డబ్బు తరలిస్తే చట్ట ప్రకారం సీజ్ చేస్తామని, మద్యం తరలిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.