KMR: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రుద్రూర్ మండలంలోని అన్ని స్థానాల్లో గెలిచి బీజేపీ జెండాను ఎగరేస్తామని మండల బీజేపీ అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ ధీమా వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్రంలో మండల బీజేపీ కార్యకర్తలకు రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.