NRML: నిర్మల్ పట్టణంలోని ప్రసూతి ఆసుపత్రిలో వినికిడి లోపం ఉన్న దివ్యాంగులకు బుధవారం సదరం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన దివ్యాంగులు హాజరయ్యారు. వీరికి వైద్యురాలు రోషిని, ఆడియోలోజిస్ట్ సతీష్‌లు వైద్య పరీక్షలను నిర్వహించారు. అర్హులైన వారికి త్వరలోనే సర్టిఫికెట్లు అందిస్తామని తెలిపారు.