వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి (MLA Rohit Reddy) తనకు కేటాయించిన సెక్యూరిటీతో ఫొటో షూట్ చేయటం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. తన గన్మెన్లు, వై.సెక్యురిటీ సిబ్బందితో రోహిత్ రెడ్డి చేసిన వీడియో షూట్స్ (Video shoots) సోషల్ మీడియాలో వైరల్ మారాయి. ఈ వీడియోలో ముందుగా రోహిత్ రెడ్డి కాషాయ వస్త్రాలు ధరించి నడుచుకుంటూ వస్తుండగా.. ఆయన వెనక నుంచి సెక్యూరిటీ సిబ్బంది (Security personnel) ఒక్కొక్కరుగా బయటకు వస్తుంటారు. బ్యాగ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అవుతుంది. ఈ క్రమంలో రెండు వైపులా సెక్యూరిటీ సిబ్బంది నడుస్తుండగా.. మధ్యలో రోహిత్ రెడ్డి నడుచుంటూ వస్తుంటారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వివాదం సమయంలో రోహిత్ రెడ్డి భద్రతపై ఆందోళన వ్యక్తం చేయగా రాష్ట్ర ప్రభుత్వం అదనపు భద్రత కల్పించింది. అదే భద్రతా సిబ్బందితో ఇలా రీల్స్ చేసి వివాదంలో చిక్కుకున్నారు ఇక, ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.వికారాబాద్(Vikarabad) లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కొన్నిరోజులుగా యాగం చేస్తున్నారు. రోహిత్ రెడ్డి నిర్వహిస్తున్న అతిరుద్ర మహా యాగంలో భారీ అగ్నిప్రమాదం(fire Accident) చోటుచేసుకుంది. చివరి రోజు పూర్ణాహుతిలో ప్రధాన యాగశాలలో అగ్నిప్రమాదం చోటు చేసుకోగా టెంట్స్ అన్నీ కాలిబూడిద అయ్యారు.అతిరుద్ర మహా యాగం మండపంతో పాటు మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది.