Salaar Movie: ‘సలార్’ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా దెబ్బకు సోషల్ మీడియా షేక్ అయిపోతోంది. రిలీజ్‌కు ముందే ఎన్నో రికార్డులు సృష్టిస్తోంది సలార్ మూవీ. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్‌కు భారీ రెస్పాన్స్ రాగా.. ఇక ఇప్పుడు ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు రెడీ అవున్నట్టు తెలుస్తోంది.
కెజియఫ్(KGF) తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ మూవీ(Salaar Movie) ఎక్కడా లేని అంచనాలున్నాయి. ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ మాస్ మూవీ సలార్ రాబోతోంది. అందుకే.. జూలై 6న రిలీజైన సలార్ టీజర్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. విడుదలైన 24 గంటల్లోనే 83 మిలియన్ల వ్యూస్ అందుకుని సరికొత్త రికార్డు సెట్ చేసింది. రెండు రోజుల్లోనే 100 మిలియన్ల వ్యూస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా.. సోషల్ మీడియా వేదికగా అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు మూవీ మేకర్స్. అలాగే ఆగస్టులో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ట్విట్టర్లో ప్రకటించారు.
దాంతో ఆగష్టు వరకు సలార్ నుంచి ఎలాంటి అప్డేట్స్ ఉండవని అనుకున్నారు అభిమానులు. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. సలార్ ఫస్ట్ సింగిల్ రెడీ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు కెజియఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. దాంతో సలార్ మ్యూజిక్ ఆల్బమ్ పై భారీ అంచనాలున్నాయి. సలార్ మ్యూజిక్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలో సలార్ ఫస్ట్ సింగిల్ లోడింగ్ అంటూ.. సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
ప్రస్తుతం చెన్నైలో మ్యూజిక్ పనుల్లో బిజీగా ఉన్నాడట సంగీత దర్శకుడు రవి బస్రూర్. సలార్ కోసం పవర్ ఫుల్ ఆల్బమ్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నాడట. ఈ క్రమంలో సలార్ సినిమా ఫస్ట్ సింగిల్ రెడీ అయినట్టు తెలుస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం.. ఈ సాంగ్ అప్డేట్ ఈ వారంలో లేదంటే.. వచ్చే వారంలో ఉండొచ్చని తెలుస్తోంది. దాంతో.. ట్రైలర్ కంటే ముందు ఫస్ట్ సింగిల్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.