»Indw Vs Banw The Indian Womens Team Lost In The Third T20 The Series Is Ours
INDW vs BANW : మూడో టీ20లో భారత మహిళల జట్టు ఓటమి..సిరీస్ మనదే
టీ20 సిరీస్‌లో 2-1తో బంగ్లాపై భారత్ మహిళా జట్టు సిరీస్ ను కైవశం చేసుకుంది. నేటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. మూడు టీ20ల మ్యాచ్‌లో భారత్ రెండు మ్యాచులు గెలవగా బంగ్లాదేశ్ 1 మ్యాచ్ గెలిచింది. జులై 16 నుంచి ఈ జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
బంగ్లాదేశ్ టీమ్‌తో టీ20 మూడో మ్యాచ్ ఆడిన భారత మహిళల జట్టు ఓటమిపాలైంది. తొలి రెండు మ్యాచుల్లో భారత మహిళల జట్టు విజయం సాధించింది. అయితే మూడో టీ20 మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగినట్లైంది. ఈ మ్యాచ్‌లో బంగ్లా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. షమీమ సుల్తానా 42 పరుగులు చేసి బంగ్లా జట్టును గెలిపించింది. దీంతో హర్మన్ ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) సేన ఓటమిపాలవ్వడంతో 2-1తో భారత మహిళల జట్టు సిరీస్ కైవశం చేసుకుంది.
మొదటగా టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 102 రన్స్ చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 40 పరుగులు చేయగా జెమీమా రోడ్రిగ్స్ 28 పరుగులు చేసింది. స్టార్ ఓపెన్ స్మృతి మంధాన కేవలం ఓ పరుగు మాత్రమే చేసింది. షఫాలీ వర్మ 11, యష్తిక భాటియా 12 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరారు.
బంగ్లా బౌలర్లలో రాబియా ఖాన్ 3, సుల్తానా ఖాతూన్ 2 వికెట్లు తీశారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ 18.2 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి 103 పరుగులతో విజయం సాధించింది. భారత బౌలర్లలో మిన్ను మని, దేవిక వైద్య చెరో రెండేసి వికెట్లను పడగొట్టారు. ఇకపోతే ఇదే స్టేడియంలో మూడు వన్డేల సిరీస్ జులై 16 నుంచి ప్రారంభమవ్వనుంది.