ASF: మాజీ మావోయిస్టు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ హరిత పేర్కొన్నారు. ఎస్పీ నితికా పంత్, ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మత్తో కలిసి ఆమె సమీక్ష నిర్వహించారు. మాజీ మావోయిస్టు నగేష్ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, భూమి పట్టా మంజూరు చేయాలని, వారి కుమార్తె ఉన్నత చదువులకు ఆర్థిక సాయం అందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.