SDPT: రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న 18 వేల ఆర్టీజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఈనెల 10న హైదరాబాద్ ఎస్పీడీసీఎల్ ఆఫీస్ ఎదుట చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ టీవీఏసి జెఎసి నాయకులు గౌటే భాస్కర్ పిలుపునిచ్చారు. చిన్నకోడూర్ మండలం పెద్దకోడూర్ సబ్ స్టేషన్లో మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ రూల్స్ అమలు చేసే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు.