KMM: మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కారేపల్లి సీఐ తిరుపతిరెడ్డి శనివారం హెచ్చరించారు. టూ వీలర్ వాహనదారులు మితిమీరిన వేగంతో వాహనాలు నడపొద్దని సూచించారు. మూల మలుపుల వద్ద జాగ్రత్త వహించాలన్నారు. టూ వీలర్ వాహనాలపై త్రిబుల్ రైడింగ్ చేయరాదన్నారు. పోలీస్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.