SRD: ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన హత్నూర మండలం దౌల్తాబాద్ చౌరస్తావద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నవాబుపేటకు చెందిన ఎర్రోళ్ల లక్ష్మణ్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో స్థానికులు మంటలను ఆర్పి చికిత్సకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.