SRD: జిన్నారం మండలంలో దేవాలయాల అభివృద్ధికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, సీజీఆర్ ట్రస్ట్ ఛైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి విరాళం అందజేశారు. కాజిపల్లి గ్రామంలోని శ్రీశ్రీశ్రీ కాశీ విశాలాక్షి విశ్వనాథ గణపతి నూతన దేవాలయానికి ₹1,01,116, అలాగే సోలక్పల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ₹40,000 విరాళంగా అందించారు.