ADB: బోథ్ మండలంలోని పలు మండలాలకు చెందిన 76 మంది లబ్ధిదారులకు రూ.25 లక్షల 66 వేల విలువ గల CMRF చెక్కులను MLA అనిల్ జాదవ్ ఆదివారం పంపిణీ చేశారు. CMRF పథకం పేద ప్రజలకు ఒక వరం లాంటిదని అన్నారు. వైద్య ఖర్చుల వివరాలను MLA క్యాంపు కార్యాలయంలో సమర్పించి CMRF తద్వారా లబ్ధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.