NLG: రాంరెడ్డిపల్లిలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా బుధవారం ఓవర్ హెడ్ ట్యాంకుల క్లోరినేషన్ చేపట్టారు. సర్పంచ్ లపంగి నరసింహ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది ట్యాంకులను శుభ్రం చేశారు. వేసవి దృష్ట్యా గ్రామస్థులు మంచినీటిని పొదుపుగా వాడుకోవాలని, వ్యాధులు ప్రబలకుండా నిల్వ నీటిని తొలగించాలని సర్పంచ్ సూచించారు.