MDK: మెదక్ జిల్లాకు చెందిన టి. యాదగిరి దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. యాదగిరిగుట్టలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ.. దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చూసేందుకు తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు.