MLG: జిల్లాలోని ఎస్సీ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ శబరీష్ నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. అధికారులు నిష్పాక్షికంగా విధులు నిర్వర్తించాలని, కేసుల దర్యాప్తు వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా, సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.