NRML: జిల్లాలోని 9, 10 వ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 15 చివరి తేదీ అన్నారు. విద్యార్థులు తమ సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.