VKB: చిట్యాలలో సనికెపల్లి చెన్నయ్య (43) నివాసం ఉంటున్న పాత ఇల్లు ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాద సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. 40 ఏళ్లుగా ఉంటున్న నివాసం నేలమట్టం కావడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. తమను ఆదుకుని, తక్షణమే ‘ఇందిరమ్మ ఇల్లు’ మంజూరు చేయాలని బాధితుడు చెన్నయ్య ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.