BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి విస్తృతంగా పర్యటించారు. పలు గ్రామాల్లో వివిధ కారణాలతో మరణించిన కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మాజీ MLA మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.