SRPT: కోదాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సమక్షంలో మునగాల మండలం, నేలమర్రి బీఆర్ఎస్ నాయకులు గురువారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు.మాజీ ఎంపీటీసీ వెంకట రామిరెడ్డి ఆధ్వర్యంలో 35 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అన్నారు.