కామారెడ్డి: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు బీబీపేట్ ఎస్సై విజయ్ తెలిపారు. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఆయన సూచించారు.