NRML: 108 సేవలను సద్వినియోగం చేసుకోవాలని సోన్ మండల నాయకులు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అందించిన 108 వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలను కాపాడటానికి 108 సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఇందులో స్థానిక అధికారులు, మండల నాయకులు పాల్గొన్నారు.