NZB: జిల్లాలో నేటి నుంచి పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. నిజామాబాద్ జిల్లాలో 542గ్రామ పంచాయతీలు ఉండగా, 8,51,417 మంది ఓటర్లు ఉన్నారు. తొలి విడతలో 184 జీపీలలో (1642 వార్డులు) పోలింగ్ జరగనుంది. కామారెడ్డి జిల్లాలో 532 జీపీలు, 6,39,730 మంది ఓటర్లు ఉన్నారు. మొదటి విడతలో 167 జీపీలలో (1520 వార్డులు) ఎన్నికలు నిర్వహించనున్నారు.