MBNR: జడ్చర్ల మండలం కోడ్గల్ గ్రామంలో బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని వృద్ధులకు వైద్యం అందించి మందులు పంపిణీ చేశారు. సర్పంచ్ సాయిరెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యం ఉన్నప్పుడే ఆర్థిక స్వావలంబన సాధ్యమన్నారు. భవిష్యత్తులో మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించి గ్రామాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.