GDWL: జూరాల ప్రాజెక్ట్‌కు ఎగువ కర్ణాటక నుంచి ప్రస్తుతం 54 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారి వెంకటేశ్ తెలిపారు. వరద ప్రవాహం పూర్తిగా తగ్గిన నేపథ్యంలో, ప్రాజెక్టు ఓ గేటు ద్వారా దిగువ ప్రాంతానికి 53,749 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318 అడుగులు కాగా, సోమవారం 316 అడుగులు కలవన్నారు.