KNR: చొప్పదండిలోని జెడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాల పొగాకు రహిత సమాజ నిర్మాణం, పొగాకు దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినందుకు జాతీయ స్థాయి కన్సోలేషన్ అవార్డును సాధించింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయుడు తిరుపతి అవార్డును అందుకున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడుతామన్నారు.