SRCL: బాలల హక్కులు పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర బాలుల హక్కుల కమిషన్ నెంబర్ మర్రిపల్లి చందన అన్నారు. చందుర్తి మండలం మరిగడ్డ గ్రామంలోని అంగన్వాడి కేంద్రం, సనుగుల గ్రామంలోని గంగిరెద్దుల కాలనీని సందర్శించారు. ఈ క్రమంలో బాలల హక్కులపై అవగాహన కల్పించారు. బాలల హక్కుల పరిరక్షణలో అధికారులంతా భాగస్వాములు కావాలని అన్నారు.