WNP: అమరచింత మండలంలోని నాగల్ కడుమూరు దేవేంద్ర ఆచార్యుల మఠంలో అరుదైన ఎర్ర చింతకాయ చెట్టు అందర్నీ ఆకర్షిస్తోంది. సాధారణంగా చింతకాయలు తెల్లగా ఉంటాయి కానీ ఇక్కడ చెట్టు ఎర్రని చింతకాయలు కాస్తోంది. ఇది ఇతర ప్రాంతాల్లో కనిపించదని, ఆయుర్వేద ఔషధంగా ఉపయోగపడుతుందని మఠం నిర్వాహకులు నరసింహ చారి, నవీన్ చారి తెలిపారు.