MBNR: జిల్లా వ్యాప్తంగా “అమ్మ మాట-అంగన్వాడీ బాట” కార్యక్రమాన్ని ఈనెల 10 నుంచి 17వ తేదీ వరకు ప్రతి అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి సోమవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో 3 సంవత్సరాల పైబడిన పిల్లలను గ్రామ పంచాయతీ కమ్యూనిటీ సహకారంతో ప్రతి అంగన్వాడీ సెంటర్లో నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లలతో సెల్ఫీ తీసుకోవాలన్నారు.