నల్గొండ జిల్లాలో వెల్లుల్లి ధరలు మండిపోతున్నాయి. నల్గొండ మార్కెట్లో చిల్లర ధర నాణ్యతను బట్టి కిలో వెల్లుల్లి రూ.400 నుంచి రూ.500 వరకు పలుకుతోంది. పచ్చళ్ల సీజన్ ప్రారంభమవుతుండటంతో వెల్లుల్లికి డిమాండ్ పెరుగుతోంది. గతేడాది OCT, NOVలో పలు రాష్ట్రాల్లో అకాల వర్షాలతో పంట దెబ్బతిని ఉత్పత్తి తగ్గడంతో ధరల పెరిగాయని వ్యాపారులు అంటున్నారు.