WNP: నూతనంగా మంత్రి పదవి పొందిన వాకిటి శ్రీహరిని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సోమవారం హైదరాబాదులోని తన నివాసంలో కలిసి పుష్పగుచ్చం, శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో పార్టీ కోసం పనిచేసే వారికి తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం శ్రీహరికి మంత్రి పదవి ఇచ్చి తన నిబద్ధతను నిరూపించుకున్నారన్నారు.