KKD: గొల్లప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసిన వడ్లమూరు జయలక్ష్మీకి షైనింగ్ స్టార్ అవార్డు లభించింది. ఇంటర్ CEC గ్రూపులో ఆమె 939 మార్కులు సాధించింది. కాకినాడలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ చేతుల మీదుగా రూ.20 వేల నగదు, ప్రశంసా పత్రం, షైనింగ్ స్టార్ అవార్డు జయలక్ష్మీ అందుకుంది. అనంతరం అధ్యాపకులు విద్యార్థినిని అభినందించారు.