ADB: గాదిగూడ మండలంలోని కుండీ షేక్ గూడ గ్రామానికి రోడ్డు మార్గానికి అటవీశాఖ అనుమతులు ఇవ్వాలని కోరుతూ గ్రామస్తులు ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు. పిప్పిరి గ్రామం నుంచి కుండీ షేక్ గూడ గ్రామానికి రోడ్డు మార్గం మంజూరైనప్పటికీ అటవీశాఖ అనుమతులు లేనందున పనులు ఆపివేయడం జరిగిందన్నారు. అటవీ శాఖ అనుమతులు వచ్చేలా చూడాలని ఎస్పీతో గ్రామస్తులు విన్నవించారు.