BDK: పాల్వంచ పట్టణ కేంద్రంలో ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ ఎదురుగా ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగిందని స్థానికులన్నారు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని వీరికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.