NZB: మెండోరా మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం స్వల్పంగా తగ్గింది. ఎగువ మహారాష్ట్ర ప్రాంతంలో వర్షాలు తగ్గడంతో అక్కడ ప్రాజెక్టుల నుండి నీటిని నిలిపివేశారు. దీంతో ప్రస్తుతం 34,790 క్యూసెక్కుల నీరు వస్తోంది. వచ్చిన నీటిని వచ్చినట్లు 6 గేట్ల ద్వారా గోదావరిలోకి వదులుతున్నామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.