MDK: జిల్లాలోని వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నట్లు కలెక్టర్ రాహుల్ పేర్కొన్నారు. పిల్లికొటాల్లో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలోని క్యాంటీన్, హాస్టల్, మెస్లను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రవీంద్ర కుమార్, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.