KMR: బాన్సువాడ మండలం పోచారం గ్రామపంచాయతీకి ఓ ప్రత్యేకత ఉంది. గ్రామం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకుంటున్నారు. ఈ గ్రామపంచాయతీ 1984లో ఏర్పడగా మొదటి సర్పంచ్‌గా బూదయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి సర్పంచులు, వార్డుసభ్యులు అందరూ ఏకగ్రీవంగానే ఎన్నికవుతున్నారు. కాగా, మొదటిసారిగా ఈ గ్రామంలో ఎన్నికలు జరగనున్నాయి.