గుంటూరు: మార్ఫింగ్ ఫొటోస్, ఫోన్ నంబర్లతో కాల్ గర్ల్ అంటు సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారని పలువురు మహిళలు పట్టాభిపురం పోలీస్ లను ఆశ్రయించారు. ఫోన్ నెంబర్ ఆన్లైన్లో పెట్టడంతో ప్రతిరోజు తమకు రకరకాల కాల్స్ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరువుకి భంగం కలిగిస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.