KDP: చెన్నూరు PHC పరిధిలోని కేఓఆర్ కాలనీ ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ వసతి గృహంలో మంగళవారం రాత్రి వైద్యాధికారి డాక్టర్ వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి, విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సుబ్బరామయ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.