సూర్యాపేట జిల్లాలో గ్రామ పంచాయతీ, వార్డు సభ్యుల నామినేషన్ల మూడో విడత ప్రక్రియ బుధవారం ప్రారంభం కానుంది. జిల్లాలోని మేళ్లచెరువు, చింతలపాలెం, నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్ నగర్, పాలకవీడు, మఠంపల్లి మండలాల్లోని 146 గ్రామ సర్పంచులకు, 1318 వార్డు సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నేటి నుంచి ఈనెల 5 వరకు నామినేషన్ల పర్వం కొనసాగనుంది.