అన్నమయ్య: ‘దిత్వా’ తుఫాను కారణంగా చిట్వేల్ మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పద్మావతి స్కూల్ పరిధిలోని ఎల్లమ్మ రాజు చెరువు నీరు, సరైన వాటర్ దారులు లేకపోవడంతో జనావాస ప్రాంతంలోకి చొచ్చుకొచ్చింది. అంబేద్కర్ సర్కిల్ ప్రాంతం కుంటను తలపిస్తోంది. చెరువు నుంచి వచ్చిన నీరు ఇళ్లపైకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలవలు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు.