E.G: సత్యసాయి మంచినీటి పధకం మొరాయించి నెల రోజులకు పైగా కావొస్తున్నా.. అదికారులు పట్టించుకోకపోవడంతో సుమారు 80 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దేవీపట్నం. గోకవరం, రాజానగరం, సీతానగరం, కోరుకొండ మండలాల్లో సుమారు 80 గ్రామాల మంచి నీటికి సత్యసాయి మంచి నీటి పధకమే దిక్కు. గత 35 రోజుల నుంచి కాంట్రాక్టర్ నిర్వహణను వదిలెయ్యడంతో తాగునీరు రాని పరిస్థితి ఏర్పడింది.