MNCL: బెల్లంపల్లి MLA క్యాంపు కార్యాలయంలో గురువారం విజయదశమి పండుగ సందర్భంగా MLA గడ్డం వినోద్ భక్తి శ్రద్ధలతో ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. దసరా పండుగ చెడు మీద గెలిచిన దానికి ప్రతీక అని, ఈ పర్వదినం ప్రతి ఇంటికి ఆనందం, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు.