SRD: మనూరు మండలం బోరంచ నల్ల పోచమ్మ ఆలయంలో ఆదివారం భాను వాసరే విశేష పూజ కార్యక్రమాలను ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి చేపట్టారు. అమ్మవారికి పంచామృతాలు, గంగా జలాలతో అభిషేకం చేసి నక్షత్ర హారతి సమర్పించారు. అదేవిధంగా కుంకుమార్చన, ప్రత్యేక ఆరాధన, దీపారాధన చేశారు.