SRD: సత్యం అహింస మార్గంలో ఏదైనా సాధించగలమని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సదాశివపేటలోని ఆయన విగ్రహానికి గురువారం పూలమాలవేసి నివాళి అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గాంధీ చూపిన మార్గం ప్రతి ఒక్కరికి అనుసరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.