MBNR: కురుమూర్తి స్వామి హుండీ లెక్కించగా ఆదాయం రూ. 7,96, 8812 వచ్చినట్లు ఆలయ ఈవో మదనేశ్వర్ రెడ్డి తెలిపారు. సోమవారం భక్తుల నుండి వచ్చిన కానుకలను మూడు విడతలుగా ఆలయ సిబ్బంది లెక్కించగా.. హుండీ ఆదాయం సమకూరినట్లు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండల సభ్యులు భారతమ్మ, వెంకటేశ్వర్లు, శ్రీధర్ రెడ్డి, చక్రధర్ రెడ్డి, మాజీ ఛైర్మన్ ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.