WGL: నల్లబెల్లి మండలం మేడపల్లి గ్రామ చెరువు కట్ట వద్ద నిర్వహించిన సత్తియాడి (లక్ష్మీ దేవమ్మ) పూజా కార్యక్రమంలో MLA దొంతి మాధవరెడ్డి, MP పోరిక బలరాం నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బంజారా సంస్కృతి, సంప్రదాయాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.